Header Banner

టీమిండియా అమ్మాయిలు వరల్డ్ కప్ గెలవడంపై చంద్రబాబు, లోకేశ్ స్పందన! తద్వారా ప్రతి భారతీయుడు గర్వించేలా..

  Sun Feb 02, 2025 19:45        Politics

టీమిండియా అమ్మాయిలు వరుసగా రెండోసారి ఐసీసీ అండర్-19 టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకోవడం పట్ల భారత్ లో సంబరాలు చేసుకుంటున్నారు. జాతి గర్వించేలా చేశారంటూ టీమిండియా అమ్మాయిల జట్టుపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా భారత జట్టు అద్భుతమైన ఘనత పట్ల హర్షం వ్యక్తం చేశారు. "టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత అండర్-19 అమ్మాయిల జట్టుకు అభినందనలు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో  మీ కఠోర శ్రమ, పట్టుదల, దృఢ సంకల్పంతో 9 వికెట్ల తేడాతో ఘనతర విజయం సాధించారు. తద్వారా ప్రతి భారతీయుడు గర్వించేలా చేశారు. దేశానికి పేరు తీసుకురావడం మాత్రమే కాదు, లెక్కలేనంతమంది బాలికలకు ప్రేరణగా నిలిచారు.

 

ఇంకా చదవండి: ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్‌ మామూలుగా లేదుగా!

 

యావత్ దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, డిఫెండింగ్ చాంపియన్ గా టోర్నీలో అడుగుపెట్టి రెండోసారి కూడా మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. సమష్టి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని లోకేశ్ కొనియాడారు. టోర్నీ మొత్తం తనదైన బ్యాటింగ్, బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేసిన తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష అందరికీ గర్వకారణంలా నిలిచారని కితాబిచ్చారు. భారత మహిళల జట్టు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ICCUnder-19Women's #Worldcup #TeamIndia #Chandrababu #NaraLokesh